హైదరాబాద్ ఫతేనగర్ లో ఓ మహిళకు రోడ్డు పక్కనే డెలివరీ అయింది. వైజయంతీ అనే గర్భిణీ పోచమ్మ గుడి రోడ్డులో వెళ్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే డెలివరీ కూడా అయిపోయింది. విషయం తెలిసిన వెంటనే అమీర్ పేట్ అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
తల్లీ, బిడ్డను బాలానగర్ పీహెచ్సీకి తరలించారు అంబులెన్స్ సిబ్బంది. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వైజయంతికి ఇది నాలుగో కాన్పు. ఇద్దరూ సేఫ్ గా ఉండడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.