సినిమా పరిశ్రమలో కొన్ని వార్తలకు కాస్త హైప్ ఎక్కువగా ఉంటుంది. అందులో అప్పట్లో జరిగిన విషయాలకు సంబంధించి ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా వార్తలు చూస్తున్నారు. ఇంటర్వ్యూలలో ప్రముఖ దర్శకులు, సీనియర్ నటులు, నిర్మాతలు చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. ఇలానే ఒక విషయం వైరల్ గా మారింది. అది ఏంటీ అంటే… కాట్రగడ్డ మురారి కుక్కలకు స్టార్ హీరోయిన్ పేర్లు పెట్టడం.
మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ఆయన ఒక వెలుగు వెలిగారు. అలాంటి నిర్మాత చిలిపిగా ఒక పని చేసారు. అది ఏంటో చూద్దాం. భానుమతి, రామకృష్ణ, గాయత్రి అని కుక్కలకు ఆయన పేర్లు పెట్టారు. భానుమతి స్టార్ హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. అయితే కాట్రగడ్డ మురారి సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక పుస్తకం రాయాలని భావించి భానుమతి దగ్గరకు వెళ్లి నిర్మాతల గురించి కాస్త సమాచారం అడగాలి అనుకున్నారు.
ఎన్ని సార్లు వెళ్ళాలి అనుకున్నా ఆమె కలవడం లేదు. అదే టైం లో మురారికి రాట్ వీలర్ అనే జాతి కుక్కను ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. దీనితో ఆ కోపాన్ని కుక్క మీద చూపించి… కుక్కకు భానుమతి అని పేరు పెట్టారట. అలాగే మరొక కుక్కను తీసుకొచ్చి దానికి రామకృష్ణ అనే పేరు పెట్టి… ఆ తర్వాత గాయత్రి అని వాటి పిల్లలకు పేర్లు పెట్టి కోపాన్ని తీర్చుకున్నారట. అయితే వాటిని పిలిచే సమయంలో గారు అనే అనేవారట.