దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాల చిత్రంలో సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో చోళ సామ్రాజ్య యువరాణి కుందవై పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది త్రిష.ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.
నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా కుందవై పాత్రలో త్రిష ముస్తాబైన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కుందవై విభిన్న వేషధారణలో ఎంత అందంగా ముస్తాబైందో చూపించారు.
పదునైన మాటలు, భయమెరుగని మేధస్సు, అతిలోక సౌందర్యం..కలిస్తే ఆమె అంటూ క్యాప్షన్ రాశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి కుందవై, వందియదేవన్ మధ్య సాగే ప్రేమ గీతం దేవిని విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.