టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు సుకుమార్. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే మామూలుగా నటీనటులు, దర్శకుడు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. సుకుమార్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది.
అది ఏంటంటే గడ్డం… ఆయన షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు షేవింగ్ ట్రిమ్మింగ్ అసలు చేయరట. షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ అయ్యాక షేవ్ చేస్తారట.
ఇలా అయితే ఎలా బంగార్రాజు? 49 తప్పులా!!
కానీ ఈ మధ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా షేవ్ చేయలేదు. ట్రిమ్ మాత్రం చేశారు.దీంతో ఆయన గడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
చిరు ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్…మీకు తెలుసా ఈ విషయం!!
ఈ సినిమాకి సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు సుకుమార్. నిజానికి ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.