నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రిరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. అయితే మొదట ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఒక్కరే కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ రాకపోవడానికి కారణం ఏంటంటూ నందమూరి ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ చర్చించు కుంటున్నారు.
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రాజధాని తరలింపు పై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా ఉన్నాడు. రాజధాని తరలింపు పై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకారులు మద్దతుగా నిరసన కార్యక్రమం లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య ప్రిరిలీజ్ ఈవెంట్ లకు వచ్చి సినిమాలు గురించి మాట్లాడితే అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనతో ప్రిరిలీజ్ కార్యక్రమానికి రాలేదని నెట్టింట్లో బాలయ్య ఫ్యాన్స్ చెప్పు కొస్తున్నారు. మరి బాలయ్య ఆ కారణంతో రాలేదా…ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది తెలియాలి.