హుజూర్‌నగర్ ఇంచార్జ్‌గా పల్లాను ఎందుకు పెట్టారు? దీని వెనుక మతలబు ఏమిటి? ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా ఎవరో ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమిస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన నారాయణఖేడ్ ఉపఎన్నిక సందర్భంగా హరీష్‌రావుని, పాలేరు ఉపఎన్నికకు కేటీఆర్‌ని, వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికకు, మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికకు కూడా కేటీఆర్, హరీష్‌రావులను ఇంచార్జ్‌లుగా నియమించారు. మరి ఇప్పుడు ఎందుకు పల్లాను నియమించారు? అందునా ఆ జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి ఉండనే వున్నారు కదా..?!
పార్టీలో డే వన్ నుంచి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని కాదని, తెలంగాణ వచ్చాక టీఆరెస్‌లో చేరి నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన పల్లాకు బాధ్యత ఇవ్వడంపై గులాబీ శ్రేణులలో చర్చ జరుగుతోంది. జగదీష్‌రెడ్డిని పక్కన పెట్టినట్లా? లేక సైదిరెడ్డిని గెలిపించే సామర్ధ్యం ఆయనకు లేదనా? కాకపోతే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొం, భువనగరి స్థానాలలో ఓడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కన పెట్టారా అని గులాబీ శ్రేణులలో చర్చ జోరుగా సాగుతోంది. గతంలో జగదీష్‌రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పల్లా కేసీఆర్ కోటరీలో చేరాక జగదీష్‌రెడ్డి ప్రగతిభవన్‌కు పోవడం చాలా తగ్గిందని మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక మంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో సైదిరెడ్డి పరిచయం కావడం, ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చి జగదీష్‌రెడ్డి ద్వారా టీఆరెస్‌లో చేరి 2018 ఎన్నికలలో టీఆరెస్ అభ్యర్థిగా హుజూర్‌నగర్ నుంచి పోటీచేయడం జరిగింది. కానీ ఇప్పుడు సైదిరెడ్డి జగదీష్‌రెడ్డి ఫోల్డు నుంచి పల్లా ఫోల్డులోకి వెళ్ళాడు. అభ్యర్థిగా ప్రకటించడానికి కొద్దిరోజుల ముందు నుంచే సైదిరెడ్డిని తరచు ప్రగతిభవన్‌కి పిలిపించుకొని శ్రవణ్‌రెడ్డి, పల్లా మాట్లాడారని, సీఎం దగ్గరకి తీసుకెళ్లారని, నీ పని నీవు చేసుకో.. పల్లాతో టచ్‌లో ఉండు.. అని కేసీఆర్ చెప్పాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకు సైదిరెడ్డిని జగదీష్‌రెడ్డి ఫోల్డ్‌లో నుంచి బయటకు తెచ్చినట్లు ? ఏమై ఉంటుందీ అని చర్చించు కుంటున్నారు.
నల్లగొండ రాజకీయాలలో పల్లా చక్రం తిప్పుతున్నాడని అనుకుంటున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి ఉండగా కేటీఆర్ బాధ్యతలు తీసుకొంటే రాంగ్ పోతుందని భావించి మరోవైపు పల్లా ప్రాధాన్యత పెంచి జగదీష్ ప్రాధాన్యత పెంచాలన్న కేసీఆర్ వ్వుహం అయివుంటుందని భావిస్తున్నారు. ఇంఛార్జీల నియామకం దగ్గర నుంచి ఎవరెవరికి ఏఏ మండలాల బాధ్యత ఇవ్వాలనే దాకా అన్నీ.. అయితే కేటీఆర్ లేదంటే పల్లా కేసీఆర్‌లే నిర్ణయించారని, జగదీష్‌రెడ్డి పాత్ర ఏమీ లేదని అనుకుంటున్నారు. ముందు కేటీఆర్ 30మంది ఇంచార్జ్‌లను నియమించారు. వారితో సమావేశం కూడా నిర్వహించారు. ఆరోజు నైట్ సిట్టింగ్‌లో కేసీఆర్‌కి పల్లా ఇంచార్జ్‌ల లిస్టుతో పాటు సమావేశం వివరాలను చెప్పాడు. సంతృప్తి చెందని కేసీఆర్ మరో30 మందిని ఇంచార్జ్‌లుగా నియమించి అందరితో మళ్ళీ సమావేశం నిర్వహించమని చెప్పాడు. దానితో మరుసటిరోజు కూడా ఇంఛార్జీల సమావేశం పెట్టారని చెప్పుకుంటున్నారు. కేటీఆర్ వేసిన వేసిన ఇంచార్జ్‌లను కాదని పల్లా కేసీఆర్‌కి చెప్పి మార్పించాడని, అందుకే కేటీఆర్‌కి కోపం వచ్చి తరువాతి రోజు జరిగిన సమావేశానికి రాలేదని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ హుజూర్‌నగర్ బాధ్యతలు తీసుకోకపోవకం వెనుక మరో కారణం కూడా లేకపోలేదని అనుకుంటున్నారు. ఏదైనా తేడా వస్తే రాజకీయ భవిష్యత్‌కి నష్టం అనే ఉద్దేశ్యంతోనే తీసుకోలేదేమో అని గులాబీ శ్రేణులు అనుకుంటున్నాయ్. జగదీష్‌రెడ్డిని పక్కన పెట్టడం, సైదిరెడ్డిని జగదీష్ ఫోల్డ్ నుంచి బయటకు తేవడం, పల్లాకు ప్రాధాన్యం ఇవ్వడం, 60మందిని ఇంచార్జ్‌లుగా నియమించడం.. ఇవన్నీ నల్లగొండ టీఆరెస్‌లో హిట్ పుట్టిస్తున్నాయ్.
టీఆరెస్ ఎప్పడూలేని విధంగా కులాల వారీగా ఇంచార్జ్‌లను నియమించాడు. ఏ ఏ కులాలు ఏ ఏ మండలాలలో వున్నాయో విశ్లేషించి దాని ప్రకారం ఇంచార్జ్‌లను నియమించడం మీద కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు అలా నియమించినట్టు? ఓడిపోతామనే అనే డౌట్ ఏమైనా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఇప్పటికే ఇంచార్జ్‌లు నియోజకవర్గానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. టీఆరెస్ గతంలో ఎప్పుడు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని, ఫస్ట్ టైం ఇంఛార్జీలకు ఖర్చులకు డబ్బులు ఇచ్చిందని అనుకుంటున్నారు.