హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఉత్తమ్ వ్యూహాత్మక తప్పిదమా?
పథకం ప్రకారం జరిగిందా?
కాంగ్రెస్ నాయకుల్లో అనుమానాలు
ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ పై అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ వ్యూహాత్మక తప్పిదం చేశారా? పథకం ప్రకారమే ప్లాన్ చేశారా అని మట్లాడుకుంటున్నారు. మల్లు రవి, మధు యాష్కీ మరి కొందరు సీనియర్లు మీడియా ముందు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ఒకసారి హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి విశ్లేషిస్తే,
2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆరెఎస్ గాలి వీచినా, హుజూర్ నగర్ ప్రజలు ఉత్తమ్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , నల్గొండ ఎంపి గా పోటీ చేసి గెలుపొందారు. ఎంపి గా కొనసాగుతూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేశారు.
అప్పటికే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆరెఎస్ లో చేరిపోయారు. సిఎల్పీ , టీఆరెఎస్ విలీనం కావాలంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆరెఎస్ లోకి వెళ్ళాలి. ఈ సమయంలో ఉత్తమ్ రాజీనామా చేశారు. దీంతో సిఎల్పీ , టీఆర్ఎస్ లో విలీనం చక చకా జరిగిపోయింది. ఒకవేళ ఉత్తమ్ రాజీనామా చేయకపోయి ఉంటే ప్రభుత్వాన్ని, టీఆరెఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండేది. కానీ ఉత్తమ్ సొంత లాభం కోసం పెద్ద తప్పే చేశారు.
ఇక్కడ ఉత్తమ్ చేసిన మరో తప్పిదం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒకవేళ నల్గొండ ఎంపిగా తను పోటీకి నిలబడకుండా, భార్య పద్మావతిని నిలబెట్టినా ఇవాళ హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చేది కాదు, సిఎల్పీ టీఆరెఎస్ లో విలీనం అయ్యేది కాదు. ఇంత సింపుల్ విషయాన్ని ఉత్తమ్ ఎలా మర్చిపోయారు. ఇదే ప్రశ్న ఇపుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ ని అడుగుతున్నారు. మరి కొందరు ముందు నుండి ఉత్తమ్ ను వ్యతిరేకించే వాళ్ళు ఉత్తమ్, కెసిఆర్ మధ్య ఒప్పందంలో భాగమే ఇదంతా అని చర్చించుకుంటున్నారు.
ఉత్తమ్ వేసిన తప్పటడుగు