దిశ మరణం తర్వాత సీఎం కేసీఆర్ మౌనం వహించటం, రెండు మూడురోజుల తర్వాత అదీ ఓ సందర్భంలో మాత్రమే రియాక్ట్ కావటంతో సోషల్ మీడియా, జాతీయ మీడియా కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి. పెళ్లిళ్లకు తిరగడానికి టైం ఉంటుంది కానీ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ పెద్దగా మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఎందుకు వెళ్లలేదని నిలదీశాయి. వీటికి తోడు సీఎం చేసిన రాత్రి 8గంటల వరకే డ్యూటీలు అనే కామెంట్‌పై దేశం మొత్తం స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, కేసీఆర్ ఇలా మాట్లాడటమేంటీ అని ప్రశ్నించాయి.
నాబిడ్డ ఆత్మకు ఇప్పుడే శాంతి కలిగింది
మరోవైపు మంత్రి కేటీఆర్‌కు ఇదే రకమైన ప్రశ్నలు వచ్చాయి. మంత్రులు చేసిన కామెంట్స్ కూడా టీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేయటంతో… ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో తక్షణ చర్యలకు ఉపక్రమించిందని, గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అక్కడ ప్రభుత్వాలనే మార్చేసిందన్న విషయాన్ని సీఎం గ్రహించే…. ఇన్‌స్టంట్ జస్టిస్ జరిగేలా చూశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సోషల్ మీడియా దెబ్బకు నేషనల్ మీడియా తోడై… కేసీఆర్ అండ్ టీంపై విరుచపడటం కూడా ఎన్‌కౌంటర్‌కు కారణమై ఉండచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.