ఏపీలో అధికార పార్టీ నిలువు దోపిడీకి పాల్పడుతోందని ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే రాష్ట్రంలో ఇసుక, మట్టి.. సిలికా గనుల దోపిడీ జరుగుతోందన్నారు. అధికారులతో కలిసి అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.
కృష్ణ, గోదావరి తో పాటు నదుల్లో ఇసుకను యంత్రాల ద్వారా తవ్వుకుంటున్నారని ఆరోపించారు సోము వీర్రాజు. నెల్లూరు జిల్లా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పై కావాలనే అహంకారపూరిత ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాసామ్య వ్యవస్థలో సమర్థనీయం కాదన్నారు.
ఇక అధికార పార్టీ రాష్ట్రంలో దోపిడీ దందాలను ఆపకపోతే.. త్వరలోనే బీజేపీ రీచ్ ల దగ్గరకెళ్లి పెద్ద ఎత్తున ఆందళనను చేపడుతుందని ఆయన హెచ్చరించారు. క్రైస్తవ మతంలోకి మారిన వాళ్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం మంచి నిర్ణయం కాదన్నారు.
రాష్టాన్ని మత రాజ్యంగా మార్చుతూ వైసీపీ ప్రభుత్వం కొన్ని చర్చిలకు విలువైన భూములను కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో బిజేపీ ఊరుకోదని పోరాటం చేస్తుందన్నారు. దళితులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు మతం మారిన క్రైస్తవులకు ఇవ్వడం సరికాదన్నారు సోమువీర్రాజు.