బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. బాలీవుడ్ దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ప్రభాస్ ఇమేజ్ తగ్గలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో వస్తున్న ఆదిపురుష్ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయింది.
దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రభాస్ లుక్ ఏ మాత్రం బాగాలేదనే మాట వినపడుతుంది. కార్టూన్ సినిమాలా ఉందనే మాటలు వస్తున్నాయి. అసలే ఆకలితో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కి ఈ టీజర్ మరింత టెన్షన్ పెంచింది అనే చెప్పాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇక కేజిఎఫ్ ట్రైలర్ ను దాటి వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే గ్రాఫిక్స్ సినిమాలతో కథపై పట్టు పోతుంది. బాహుబలి సినిమా సమయంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ప్రభాస్ ఫాన్స్ ను కంగారు పెడుతుంది. రోబో పార్ట్ 2 విషయంలో కూడా ఇలాగే జరిగింది. సాహో సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టింది. పూర్తి స్థాయి సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా కథ మీద జాగ్రత్త పడితే మంచిది అని లేదంటే ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి.