ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏ పాత్ర చేయాలన్నా సరే కాస్త ఇగోకి వెళ్లి ఇబ్బంది పెడుతూ ఉంటారు అనే మాట వాస్తవం. దర్శకులు అందుకే పాత్రలు రాసే సమయంలో హీరోలకు ఎక్కువగా హైప్ ఉండే పాత్రలు డిజైన్ చేస్తూ ఉంటారు. కాని ఒకప్పటి హీరోలు అయితే ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సరే వెనకడుగు వేయరు. అందులో కమల్ హాసన్ ఒకరు అనే చెప్పాలి. ఆయన మన తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసారు.
సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అయితే కమల్ హాసన్ పాత్ర ఎలా ఉన్నా సరే దర్శకుడికి ఎదురు చెప్పే వారు కాదు. అలా సాగర సంగమం సినిమాలో ఒక సీన్ ఆయన ఏ ఇగో లేకుండా చేసారు. ఆ సినిమాలో ఆయనకు జానకి తల్లిగా నటించింది. కుటుంబ ఆరోగ్య పరిస్థితి బాగోక డాన్సర్ గా మారిన యువకుడిగా కమల్ హాసన్ ఆ సినిమాలో నటించారు.
ఆ సినిమాలో అమ్మ మీద అతను చూపించే ప్రేమ కూడా బాగా కనెక్ట్ అయింది జనాలకు. ఒక సీన్ లో తల్లి చనిపోతుంది. అప్పుడు ఆమె కాళ్ళు పట్టుకుని ఏడవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని డైరెక్టర్ చెప్పగానే నో అనకుండా కమల్ హాసన్ చేయడానికి రెడీ అయ్యారు. అప్పటికి ఆయనకు స్టార్ ఇమేజ్ ఉంది. అయినా ఆ పాత్ర నో అనకుండా ఏ సీన్ లో దర్శకుడిని ఇబ్బంది పెట్టకుండా చేసారు.