ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే రైతు సంఘర్షణ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్ పర్యటనఖ/ సంబంధించి మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారైంది. సాయంత్రం 5 గంటలకు ప్రరంభం కానున్న ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి విమాన మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. 6 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు.
8 గంటలకు వరంగల్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి రాత్రి 10గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు. రేపు మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరి సంజీవయ్య పార్కులో దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు రాహుల్ నివాళులు అర్పిస్తారు.
Advertisements
అక్కడి నుంచి ఒకటిన్నరకు గాంధీభవన్ వెళతారు. 2.45 గంటలకు ఎక్స్ టెండెడ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత మెంబర్ షిప్ కో ఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. మధ్యాహ్నం 3గంటలకు బై రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.50 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్నారు.