విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు గ్యాస్ లీకై కలకలం సృష్టిస్తే, రెండోరోజు క్యూలైన్లలో తేలు ప్రత్యేక్షమై భక్తుల్ని కకావికలం చేసింది. జనం మధ్య సడెన్‌గా తేలు కనిపించే సరికి భక్తులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే వున్న సెక్యూరిటీ సిబ్బంది స్పందించి ఎవరీకి హనీ కలగకుండా వెంటనే తేలును చంపేశారు. అమ్మవారి ఆలయంపైన కొండ ఉంటుంది. అక్కడి నుంచి విష పురుగులు వస్తుంటాయని అక్కడి వారు చెబుతున్నారు. ఇలాంటి ఉత్సవ సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకువాలని అధికారులకు, సిబ్బందికి భక్తులు సూచిస్తున్నారు.