ఐశ్వర్య రాయ్.. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందాలతో కుర్రకారులో ఉర్రూతలూగించిన అందాల భామ. తాను స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి పెళ్లిచేసుకొని.. ఆపై ఆరాధ్యకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించి, కూతురుకే ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తోంది.
తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్.. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. 75వ కేన్స్ ఫెస్టివల్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ అందచందాలతో హొయలొలికించారు.
అయితే.. ఆమె తిరుగు ప్రయాణంలో కూతురు ఆరాధ్య, భర్తతో కలిసి కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్ వైరల్ భయాని.. తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఓ వీడియోను సోసల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఐశ్వర్య తన పొట్టను కనిపించకుండా కవర్ చేస్తూ.. ఉన్నట్టు కనిపించింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్స్ ఆమె ప్రెగ్నెంట్ కావచ్చు.. అందుకే కవర్ చేసుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఐశ్వర్య ఎలా స్పందిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.