టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి పేరు వింటే చాలు స్టార్ హీరోలకు సైతం పూనకం వస్తుంది అనే మాట వాస్తవం. ఆయన సినిమా చేయాలి అనుకున్న హీరోకి ఒక సూపర్ హిట్ పడినట్టే. అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే సూపర్ హిట్ అయినట్టే. అందుకే రాజమౌళి ఒక కథ చెప్తే మరో ఆలోచన లేకుండా ఏ మార్పులు చెప్పకుండా ఓకే చేస్తూ ఉంటారు కథను.
ముందు రాఘవేంద్ర రావు వద్ద ఆయన సహాయ దర్శకుడిగా పని చేసారు. అప్పట్లో హిట్ సినిమాలకు రాజమౌళి పని చేసారు. ఇక కొన్ని రోజులకు సీరియల్స్ ద్వారా ఆయన డైరెక్టర్ అయ్యారు. శాంతి నివాసం అనే సీరియల్ కు ఆయన దర్శకుడిగా చేసారు. ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఆ సీరియల్ లో రంగనాథ్ వంటి సీనియర్ నటులు కూడా నటించారు. ఇక అప్పట్లోనే రాజమౌళి ఒక్కో షాట్ కోసం బాగా కష్టపడేవారు.
అలా రంగనాథ్ లో కూడా కాస్త వైవిధ్యం అడగడంతో ఆయన ఫీల్ అయ్యారట. రంగనాథ్ అప్పటికే సినిమాల్లో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకు ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి నటుడితో ఒక సీరియల్ కోసం తనకు నచ్చిన షాట్ వచ్చే వరకు రాజమౌళి షూట్ చేసారట. దీనితో రంగనాథ్ కి కోపం వచ్చి తిట్టారట. అయినా రాజమౌళి తాను ఏం చేయాలనుకున్నారో అది చేసారు, ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది.