అంతర్జాతీయ క్రికెట్ లో క్రికెటర్లు పొడుగు ఉంటే ఆడే సమయంలో ప్రత్యర్ధిని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉంటారు. అయితే పొట్టిగా ఉన్న క్రికెటర్ లు కూడా అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలు నమోదు చేసారు, చేస్తున్నారు. క్రికెట్ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎందరో క్రికెటర్ లు తమ సత్తా చాటారు. వారి జాబితా ఒకసారి చూస్తే…
Also Read:కిరణ్ సరసన నేహా!
సునీల్ గవాస్కర్
భారత జట్టు తరుపున సంచలనాలు నమోదు చేసిన గవాస్కర్ కు లిటిల్ మాస్టర్ గా పేరుంది. 5.5 అడుగుల ఎత్తు ఉన్నా సరే బ్యాటింగ్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.
టాటెండా తైబు,
జింబాబ్వే క్రికెట్ సంచలనంగా చెప్తారు. అతి పిన్న వయసులో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. 5.41 అడుగుల ఎత్తు ఉన్నప్పటికీ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 18 ఏళ్ళకు క్రికెట్ లోకి వచ్చి 29 సంవత్సరాల వయస్సులో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.
కేదార్ జాదవ్
ఇండియన్ క్రికెట్ లోకి ఆలస్యంగా అడుగు పెట్టిన జాదవ్ బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే పేలవ ఫాం కారణంగా క్రికెట్ కెరీర్ లో ఇబ్బంది పడుతున్నాడు. ఇతని ఎత్తు కేవలం 5.41 అడుగులు.
సచిన్ టెండూల్కర్
అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. 5.41 అడుగుల ఎత్తే ఉన్నప్పటికీ క్రికెట్ ను శాసించాడు సచిన్.
గుండప్ప విశ్వనాథ్,
1970లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విశ్వనాథ్ 5.3 అడుగుల ఎత్తు. అతని బ్యాటింగ్ స్టైల్ కు ఫాన్స్ ఎక్కువ.
మోమినుల్ హక్
5.28 అడుగులు ఎత్తున్న ఈ బంగ్లాదేశ్ ఆటగాడు ఆ జట్టు తరుపున కీలక ఆటగాడు.
పార్థివ్ పటేల్
ఇండియన్ క్రికెట్ లో అతి చిన్న వయసులో కీపర్ గా మారిన పార్థివ్ పటేల్ ఎత్తు కేవలం 5.25 అడుగులు మాత్రమే.
ముష్ఫికర్ రహీమ్,
బంగ్లాదేశ్ జట్టుకి అత్యంత కీలక ఆటగాడు, ఆ జట్టు కీపర్ రహీం ఎత్తు కేవలం 5.25 అడుగులు. అయినా సరే ప్రత్యర్ధుల పాలిట సింహ స్వప్నం.
వాల్టర్ కార్న్‌ఫోర్డ్
ఇంగ్లాండ్ జట్టు తరుపున 1930 లో ప్రాతినిధ్యం వహించిన ఈ క్రికెటర్ ఎత్తు కేవలం 5 అడుగులు మాత్రమే.
క్రుగర్ వాన్ వైక్
అంతర్జాతీయ క్రికెట్ లో అతి పొట్టి క్రికెటర్. న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన ఈ ఆటగాడి ఎత్తు 4.75 అడుగులు మాత్రమే.
Also Read:రికార్డుల వేటలో బ్రహ్మాస్త్ర ట్రైలర్