పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు. సిద్దూ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, సింగర్లు, రాజకీయ నాయకులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
సింగర్ సిద్దూ ఆదివారం హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. సిద్దూకు భద్రతను తగ్గించిన మరుసటి రోజే ఆయనను దుండగులు హతమార్చారు.
ఈ క్రమంలో ఆప్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడటంలో ముఖ్యమంత్రి మాన్ విఫలమయ్యాడని పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు సిద్దూ హత్య కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు కస్టడిలో విచారణ చేస్తున్నారు.