ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్చర్యకర ఘటన జరిగింది. అమెరికాలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాన్పూర్‌లో తన ఇంటిని హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ సహాయంతో దొంగల బారి నుంచి కాపాడుకున్నాడు. అక్కడి పోలీసులను సైతం ఈ వ్యవహారం ఆశ్చర్యపరిచింది. తన ఫోన్ కు లింక్ చేసుకుని తన ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకున్న హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా తన ఫోన్‌లో అలర్ట్ రావడంతో వెంటనే అలెర్ట్ అయి పోలీసులను అలెర్ట్ చేసాడు.
కాన్పూర్‌లో నివసిస్తున్న విజయ్ మిశ్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటిపై సోమవారం అర్థరాత్రి కొందరు దొంగలు దాడి చేశారు. మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చడంతో తన ఇంటి వద్ద కొందరి వ్యక్తుల కదలికకు సంబంధించి అతనికి అలెర్ట్ వచ్చింది. తాను ఆ సమయంలో భోజనం చేస్తున్నట్టుగా విజయ్ వివరించారు. మొదట్లో కొన్ని వార్నింగ్ లు వచ్చినా తాను పట్టించుకోలేదని బయట కార్ల వలన ఆ సౌండ్ వస్తుందని భావించా అని కాని ఆ వార్నింగ్ లు కంటిన్యూ కావడంతో తాను లైవ్ ఓపెన్ చేసాను అని విజయ్ చెప్పాడు.
సీసీటీవీ వైర్లను కత్తిరించినా సరే విజయ్ కు అక్కడ ఏం జరిగిందో అర్ధమైంది. కెమెరాలను విద్యుత్‌తో పాటు బ్యాటరీతో కూడా కనెక్ట్ చేసాడు. వెంటనే తన తమ్ముడ్ని అలెర్ట్ చేయగా అతని తమ్ముడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు కూడా వెంటనే రావడంతో దొంగతనం ఆగిపోయింది. కాన్పూర్ పోలీసుల ప్రయత్నాన్ని మెచ్చుకున్న అశుతోష్, కాన్పూర్ పోలీసుల స్పందన తమ అంచనాలకు మించి ఉందని హర్షం వ్యక్తం చేసాడు.