కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకు వృద్ద తల్లిదండ్రులను బయటకు నెట్టేశాడు. రోడ్డున పడ్డ ఆ వృద్ద దంపతులు.. చలికి వణుకుతూ..బతుకు జీవుడా అంటూ జీవించడం చూస్తే ఎవరికైనా కళ్లుచెమ్మగిల్లక తప్పదు. తమ తల్లిదండ్రులను భయటకు నెట్టేసిన కొడుకుకు భవిశ్యత్తులో తమ పిల్లలు ఇలాగే చేస్తారనే ఆలోచన వీరిలో ఎందుకు రాదు ? మనం నడిచే బాటలోనే తమ పిల్లలు కూడ నడుస్తారనే ఆలోచన రాకపోతే ఎలా ??
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియెూజకవర్గం పరిదిలోని రాజోలి గ్రామానికి చెందిన బతుకమ్మ(65), బతుకన్న (75) ఈ దంపతులకు ఒక్కడే కుమారుడు. ఈ దంపతులపై రెండెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. ఈ ఆస్తిని అనుభవిస్తున్న కుమారుడు తల్లిదండ్రులను కొన్ని నెలల క్రితం ఇంట్లో నుంచి భయటకు నెట్టేశాడు. పింఛను డబ్బు ఆసరాతో గ్రామంలోనే కిరాయికి ఓ ఇంట్లో అద్దెకు దిగారు ఆ వృద్ధ దంపతులు. అద్దె ఇంటి యజమాని వ్యక్తిగత కారణాలతో ఇటీవల వారిని ఖాళీ చేయించాడు. ఇక చేసేది లేక ఆ వృద్ద దంపతులు మూడు రోజులుగా ఆ ఇంటి ముందే సామగ్రితో గడుపుతూ,ఇలా అన్నం కోసం ఇంటింటికి తిరిగి కడుపు నింపుకుంటున్నారు…