సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. కాకపోతే ఒక జీవి ముందు, మరొక జీవి వెనుక. అంతే.. కానీ కొందరు మనుషులు, కొన్ని జీవులు.. అర్ధాయుష్షుతో చనిపోతారు. ఈ క్రమంలో అసలు మరణాన్ని జయించడం అనేది ఎవరికీ సాధ్యం కాలేదు. సైంటిస్టులు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. అయినా మరణాన్ని ఆపే సాధనాన్ని ఇంకా కనిపెట్టలేదు. అందువల్ల మరణం అనేది ప్రతి ఒక్కరికీ అనివార్యం అయింది.
అయితే నిజంగా మరణానికి చికిత్స ఉంటుందా ? అంటే.. లేదు. అసలు ఉండదు. ఆ మాటను ఊహించుకోవడమే చాలా కష్టం. ఎంతో మంది సైంటిస్టులు ఇదే విషయమై పరిశోధనలు చేస్తున్నారు కానీ పూర్తిగా విజయం సాధించలేదు. కాకపోతే కొన్ని ఎక్కువ రోజుల పాటు యవ్వనంగా ఉండేలా ఆవిష్కరణలు చేశారు.
Haeri wanakh na tota se kya yilaaj kari na maut si?
(Meaning: Little sparrow won't you tell the parrot, there be any cure for death?). The singer is actually singing this to the sparrow in this video. Just lovely pic.twitter.com/kpELRR2F8E— Shuja ul haq (@ShujaUH) December 15, 2020
అయితే మరణానికి చికిత్స ఉంటుందా ? అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుందో, లేదా అతను పాడే పాట నచ్చిందో.. ఇంకో విషయమో తెలియదు కానీ.. ఆ మైనా ఆ వ్యక్తి పాడే పాటలో లీనమైంది. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి.. ఓ పిచ్చుకా, మరణానికి చికిత్స ఉండదని ఆ చిలుకకు ఎందుకు చెప్పవు.. అంటూ లయబద్దంగా పాటను పాడాడు. దానికి ఆ మైనా స్పందించి అతని పాటలో లీనమైంది. ఈ వీడియోకు ఇప్పటికే 4వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. రీట్వీట్ కూడా చేస్తున్నారు.