శృతిహాసన్…బోర్న్ యాక్ట్రెస్. హాసన్ ఫ్యామిలీలో పుట్టిన విలక్షణ నటి. అందం, అభినయం కలగలిసిన మెరుపుతీగ. 2009 లో కమల్ హసన్ డైరెక్ట్ చేసిన హేరామ్ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
అక్కడ నుంచి నటిగా, సింగర్ గా, మ్యుజీషియన్ గా విశేషప్రతిభ కనబరుస్తూ కెరీర్ గ్రాఫ్ ని ఒక రేంజ్ లో పెంచుకుంటూ పోయింది. సీనియర్లు, జూనియర్లు అనే ఢిఫరెన్స్ లేకుండా అందరి హీరోలతోనూ నటిస్తోంది.
ఇచ్చిన పాత్రలో ఒదిగిపోతూ తండ్రికి తగ్గకూతురు అనిపించుకుంటోంది. ఈ ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ చిత్రంలో, ‘నాని30’ చిత్రంలో నటిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో… స్పెషల్ డిజైన్ తో పువ్వులా విచ్చుకున్న బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. హాట్‌గా ముస్తాబై అక్కడ మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.ఈ పిక్స్ ను తను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ‘‘నెటిజన్లు వావ్ మేడమ్, బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయారు.’’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.