నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.అందులో సమరసింహా రెడ్డి సినిమా ఒకటి. అప్పట్లో ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది. రికార్డ్స్ బ్రేక్ చేసి కాసుల వర్షం కురిపించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలకృష్ణకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను తీసుకు వచ్చింది. సిమ్రాన్, అంజలా జవేరి హీరోయిన్స్ గా నటించారు. అలాగే మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ అందించగా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ కు బి.గోపాల్ కు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఒకానొక సమయంలో విజయేంద్ర ప్రసాద్ ఎన్ని కథలు చెప్పినా బి.గోపాల్ కు నచ్చేవి కాదట. దాంతో ఆయనకు చిరాకు వచ్చి కథలు చెప్పడం మానేశారట. కానీ అప్పుడు బి.గోపాల్ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ రామకృష్ణ ప్రసాద్ రాజేంద్రప్రసాద్ ను రిక్వెస్ట్ చేశాడట.
అప్పుడు విజయేంద్ర ప్రసాద్ వచ్చి ఎన్ని కథలు చెప్పినా మీకు నచ్చడం లేదు. ఎలాంటి కథ కావాలి అనుకుంటున్నారు. మీకు ఏ సినిమా ఇష్టం చెప్పండి అని అడిగాడట. గుండమ్మ కథ, దుష్మన్ సినిమా లు కలిపితే ఎలా ఉంటుందో అలాంటి కథ కావాలి అని అడిగాడట.
వారం రోజుల్లోనే సమరసింహారెడ్డి తయారు చేసుకొని వచ్చాడట విజయేంద్ర ప్రసాద్. వెంటనే హ్యాపీగా ఫీల్ అయిన బి గోపాల్ బాలకృష్ణ తో చేస్తా అని చెప్పి చెన్నై వెళ్ళాడట. బాలయ్య కూడా ఓకే చెప్పటం తో సినిమా పట్టాలెక్కింది. ఆ తరువాత సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పని లేదు.