ఫీల్ గుడ్ సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు యూత్ లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. మూడు నాలుగేళ్ల క్రితం వరకు ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. ఇప్పటి యువతను ఆయన ఆకట్టుకోలేకపోతున్నారు అనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా కోసం రెడీ అవుతున్నారని సమాచారం.
ధనుష్ కూడా శేఖర్ కమ్ముల సినిమా కోసమే జుట్టు పెంచారు అనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆనంద్ సినిమా కథ తాను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను అని అన్నారు. కాని ఆయన నో అనడంతో మరో హీరోతో చేశా అని తెలిపారు. హ్యాపి డేస్ సినిమా చాలా తక్కువ లాభానికి దిల్ రాజుకి అమ్మినట్టు ఆయన పేర్కొన్నారు.
అలాగే… సినిమా కథ రాసుకునే సమయంలోనే బడ్జెట్ విషయంలో ఒక అంచనా ఉంటుందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు ఆస్తులు అమ్ముకుని సినిమాలు కొంటారు అని ఆయన పేర్కొన్నారు. కొందరు నష్టపోయి రోడ్డున పడతారు అని వారికి ఆర్ధిక సహాయం చేయాలని తెలిపారు. ప్రేక్షకులు నచ్చితేనే సినిమా చూస్తారు అని అన్నారు. విన్నింగ్ ఫార్ములాను ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు. తాను కొన్ని సినిమాల రేంజ్ గెస్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.