హైదరాబాద్ కు చెందిన విద్యార్థినీ సౌజన్య(21) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ కాలనీ లో చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే.. తమ కూతురు చాలా దైర్యంగా ఉంటుందని అంటున్నారు చైతన్య తల్లిదండ్రులు.
కన్నకూతురు కండ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చైతన్య మృతిపై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులు హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.