నిధుల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి మరో గట్టి షాక్ తగిలింది. ఓ పనికి నిర్దేశించిన నిధులను ఇతరత్రా పనులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలను జగన్ సర్కారు ఎదుర్కొంటోంది. అయితే.. ఆ నిధుల మళ్లింపును నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఆదేశాలను జారీచేసింది న్యాయస్థానం.
ఏపీలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కింద కేటాయించిన నిధులను.. ఏపీ ప్రభుత్వం పీడీ ఖాతాలకు మల్లించింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. దానిపై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ కోర్టుకు తెలిపింది. మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన స్పందనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధులను దారి మళ్లించడం కుదరదని తేల్చి చెప్పింది.
అంతేకాకుండా.. నిధులు మళ్లిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్టు తీర్పునిచ్చింది.