మన తెలుగులో వచ్చిన కొన్ని తమిళ రీమేక్ సినిమాలు అలాగే డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అగ్ర హీరోలు చేసినా చిన్న హీరోలు చేసినా సరే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా తమిళ సినిమాల్లో కథ బలంగా ఉంటుంది అనే మాట వినపడుతుంది. అందుకే అక్కడి హీరోలు కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పెద్ద హీరోలు అయినా సరే కథ నచ్చితే ఎవరితో అయినా సినిమా చేస్తారు.
మన తెలుగులో మాత్రం వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. హీరోకి ఎక్కువగా హడావుడి చేయాల్సి ఉంటుంది. తమకు కథలో హడావుడి లేదు అంటే మాత్రం ఎలాంటి సినిమా అయినా వద్దు అంటారు అనే మాట ఉంది. ఇలా రవితేజా ఒక సినిమా వదులుకున్నారని తన మాస్ ఇమేజ్ తగినట్టుగా ఎలివేషన్ లేదనే కారణంతో సూపర్ హిట్ సినిమా వద్దు అనుకున్నారు అని ఒక వార్త వైరల్ గా మారింది.
ఆ సినిమా ఏంటీ అంటే ఆవారా… ఇందులో కథకు మంచి స్కోప్ ఉంటుంది. రవితేజాకు లింగుసామి కథ చెప్పినా ఇందులో మాస్ సన్నివేశాలు లేవు అనే కారణంతో వద్దు అని చెప్పారట. కాని ఈ సినిమా రవితేజా చేసి ఉంటే మన తెలుగులో సూపర్ హిట్ అయ్యేది. రవితేజా బాడీ లాంగ్వేజ్ కి ఆయన డైలాగ్ డెలివరికి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉండేది. ఈ సినిమా వేరే వారితో చేయడం ఇష్టం లేక లింగుసామి రీమేక్ చేయలేదట.