మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ ఏ స్థాయి స్నేహితులో అందరికి తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ మధ్య కాస్త దూరం ఉన్నా సరే అప్పట్లో మాత్రం చాలా సన్నిహితంగా ఉన్నారు. సినిమా అవకాశాల కోసం వీళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చిరంజీవి మెగాస్టార్ కాగా సుధాకర్ కమెడియన్ అయ్యారు. అయితే ఇప్పుడు సుధాకర్ సినిమాలకు దూరం అయ్యారు. ఒకప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉండేది.
ఇదిలా ఉంచితే అందరూ ఒక రూమ్ లో ఉన్నప్పుడు చేసిన అల్లరి పని ఒకటి వైరల్ గా మారింది. వీరితో పాటు హరిప్రసాద్ అనే స్నేహితుడు కూడా ఉండేవారు. వీరు ముగ్గురు కలిసి సినిమా ఆఫీస్ లకి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చే క్రమంలో ఒకానొక దశలో తినడానికి కూడా కష్టంగా మారింది. పస్తులు కూడా పడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఎక్కడా వెనకడుగు వేయలేదు.
అలా ఒకరోజు సుధాకర్… చిరంజీవి తో ఈ రోజు ఏం కూర వండుకుందాం అని అడిగారట. అప్పుడు సుధాకర్ కి పక్క ఇంట్లో ములగ చెట్టు కనపడింది. గోడ ఎక్కి ఆ ములగ చెట్టు కాయలు కోసి కూర వండారట. ఆ విషయం తెలిసిన ములగ చెట్టు యజమాని వీళ్ళు ఉండే రూమ్ వద్దకు వచ్చి పెద్ద గొడవ చేసారట. అప్పట్లో వారికి ఇది పెద్ద గొడవే అయినా ఇప్పుడు మాత్రం మంచి జ్ఞాపకం.