సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన కేసుల విచారణ జరిగింది. కాగా దాల్మియా కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గైహాజరయ్యారు. దీనితో శ్రీలక్ష్మిపై నాన్ బెయిలబుల్ వారంట్ ను సీబీఐ కోర్టు జారీ చేసింది. ఇక పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన జి.వెంకట్రామిరెడ్డి విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై ఎన్ బీడబ్ల్యూ కోర్ట్ రీకాల్ చేసింది.
అలాగే వాన్ పిక్ కేసులో మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హాజరు కాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి తరఫు న్యాయవాదులు హాజరుకాకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని కోర్ట్ హెచ్చరిక జారీ చేసింది.