ఈడి కార్యాలయం నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను ఈడీ అధికారులు విచారించారు. కాగా ఈరోజు తో సినీతారల విచారణ ముగిసింది. ఇక విచారణ లో తన బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో మొత్తం 12 మంది సినీ సెలబ్రిటీలను ఈడీ అధికారులు విచారించారు.
పూరీ జగన్నాథ్ తో ఈడీ విచారణ మొదలైంది. ఇప్పుడు తరుణ్ తో అందరి విచారణ ముగిసింది. ఆగస్ట్ 31 న పూరీ జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 2 న ఛార్మి నీ 8 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 6 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 3 నే రకుల్ హాజరయ్యారు. సెప్టెంబర్ 3 న రకుల్ ను 6 గంటల పాటు ఈడీ విచారించింది. సెప్టెంబర్ 20 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 7 న నందు హాజరయ్యారు.
అలాగే సెప్టెంబర్ 7 న ఈడి కార్యాలయానికి కెల్విన్, జీషాన్
ఇళ్లలో సోదాలు చేసి ఈడి కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8 న రానా ను 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. రానా, నందు విచారణ కు హాజరు అయ్యిన రోజుల్లో కెల్విన్ , జీశాన్ లను కలిపి అధికారులు విచారించారు. సెప్టెంబర్ 9 న రవితేజ , తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించారు.
సెప్టెంబర్ 13 న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు ఈడీ విచారించారు. సెప్టెంబర్ 15 న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 17 న తనీష్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 22 న తరుణ్ ను 8 గంటల పాటు విచారించారు.
ఇక తదుపరి ఈడీ విచారణ దర్యాప్తు కీలకం కానుంది. ఎక్సైజ్ శాఖ మాదిరిగా కేసును నీరుగారుస్తోంద లేక ముందుకు తీసుకెల్తుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్సైజ్ శాఖ పరిగణించినట్టు సినీ ప్రముఖులే బాధితులా??
లేదా అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించి తారలను నిందితులుగా చేరుస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
సినీ తారలతో పాటు రాజకీయ నాయకులకు డ్రగ్స్ తో సంబందాల పై పలువురు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే రాజకీయ నాయకుల డ్రగ్స్ వాడకం పైనా విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జెడ్సన్. మరి రాజకీయ నాయకుల డ్రగ్స్ అంశం పై ఈడి దృష్టి సారిస్తుందా? తమ పరిధిలోకి రాదని చేతులు దులుపుకుంటుందో చూడాలి. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసింది కెల్విన్ కాబట్టి అతన్ని మాత్రమే ఈడి అరెస్ట్ చేయనుందా ?? కెల్విన్ కు నిధులు సమకూర్చిన తారల పై ఈడి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.