సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్టులు వైరల్ అవుతాయో ఎవరికీ తెలియదు. అనుకోకుండా కొందరు పోస్టు చేసే ఫొటోలు, వీడియోలు అమాంతం వైరల్ అవుతాయి. భారీ సంఖ్యలో నెటిజన్లు వాటిని వీక్షిస్తారు. అయితే విషయం తెలిశాక అదంతా జిమ్మిక్ అని తెలుసుకుని.. అయ్యో.. అని వాపోతారు. అవును.. సరిగ్గా ఓ వీడియో విషయంలోనూ ఇలాగే జరిగింది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది చూశారు కదా. అందులో ఓ పెళ్లిలో వధువును ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుంటాడు. అయితే ఫొటోకు కావల్సిన యాంగిల్ కోసం ఆ ఫొటోగ్రాఫర్ ఓ సందర్భంలో వధువును టచ్ చేస్తాడు. అక్కడే ఉన్న వరుడు కోపంతో రెచ్చిపోయి ఆ ఫొటోగ్రాఫర్ చెంప వాయగొడతాడు. తరువాత వధువు అదే స్టేజిపై కింద పడి మరీ నవ్వుతుంది.
I just love this Bride 👇😛😂😂😂😂 pic.twitter.com/UE1qRbx4tv
— Renuka Mohan (@Ease2Ease) February 5, 2021
అయితే అమ్మాయిలు అంటే అలా ఉండాలి.. అంటూ కొందరు ఆ వీడియోను షేర్ చేశారు. దీనికి భారీ ఎత్తున వ్యూస్ కూడా వచ్చాయి. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి కనుక చాలా మంది ఆ వీడియోను వీక్షించారు. కానీ అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఎందుకంటే.. అది ఒక మూవీ షూటింగ్ మరి.
Ye meri movie shoot k time ki vdo h !! 😅 Thank u for sharing pic.twitter.com/DaN4jONJEQ
— Anikriti Chowhan (@ChowhanAnikriti) February 6, 2021
డార్లింగ్ ప్యార్ ఝుక్తా నహీ అనే మూవీ షూటింగ్‌లో చిన్న క్లిప్ అది. అందులో నటించిన చత్తీస్‌గడ్‌కు చెందిన నటి అనుకృతి చౌహాన్ ఆ వీడియో గురించి చెప్పింది. అది పెళ్లి వీడియో కరెక్టే.. కానీ తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని, అది తాను నటిస్తున్న ఓ మూవీలోని క్లిప్ అని.. ఆ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు ఖంగు తిన్నారు. అయితే ఆ మూవీకి ప్రచారం కల్పించడం కోసమే ఆ చిత్ర యూనిట్ వారు ఇలా చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ వీడియో అసలు పెళ్లిది కాదు, కానీ నిజంగా పెళ్లిలో తీసిందే అయితే ఇంకా భారీ ఎత్తున వైరల్ అయి ఉండేది.