– దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు..
– రాష్ట్రంలో కాస్త మెరుగ్గానే ఉందన్న కేంద్ర నివేదికలు..
– తాజా నివేదికలో వెల్లడి
దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగం. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంతో ఉపాధిలేక యువత అనేక సమస్యలను ఎదురుకుంటోంది. దీంతో రోజురోజుకూ ఉపాధి కొల్పోతున్న వారి శాతం ఎక్కువవుతోంది. ఈ నెల ప్రారంభంలో 6.62గా నమోదైన నిరుద్యోగత రేటు.. ఆదివారం నాటికి 7.56 శాతంకు పెరిగింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 7.46 శాతం నిరుద్యోగులుంటే పట్టణ ప్రాంతాల్లో 7.76 శాతం ఉన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగంతో దేశంలో ఉన్నత చదువులు చదివిన యువత కూలి పనులకు పోకతప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు రాష్ట్రంలో నిరుద్యోగత శాతం గణనీయంగా తగ్గింది. సెప్టెంబర్ లో 3.63 శాతం ఉండగా.. అక్టోబర్ లో 4.13 శాతం, నవంబర్ లో 4.14 శాతం, డిసెంబర్ లో 2.16 శాతం నమోదైనట్టు కేంద్ర గణంకాలు వెల్లడించాయి. అయితే.. జనవరి నాటికి ఇది 0.7గా నమోదైంది. ఫిబ్రవరిలోనూ అదే రీతిలో కొనసాగింది. దీంతో రాష్ట్రంలో పలు కారణాల నేపథ్యంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర నివేదికలు వెల్లడించాయి.
దేశంలో పెరుగుతున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.. పలు సంస్థలు భారీగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు కేంద్ర అన్ ఎంప్లాయిమెంట్ స్టాటికల్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. దీంతో దేశంలో నిరుద్యోగుల శాతం గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. జాతీయ స్థాయిలో చూస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఉపాధి ఎక్కువగా కొల్పోతున్నారని తెలిపింది.
ఈ నెల 13 నాటి తాజా నివేదికల ప్రకారం.. దేశం మొత్తంగా 7.56 శాతం నిరుద్యోగత ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో సగటున 7.76గా ఉందని చెప్పింది. అంతకు ముందు ఫిబ్రవరి 12న 7.59 శాతం నిరుద్యోగత ఉంటే.. పట్టణ ప్రాంతంలో 7.91గా ఉండేదని తెలిపింది. ఈ నెల 11న కూడా దేశం మొత్తంగా 7.24 శాతం నిరుద్యోగులు ఉంటే.. అందులో పట్టణ ప్రాంతాల్లో 7.79గా నమోదైనట్టు కేంద్ర వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు అధికారులు.
రాష్ట్రంలో నిరుద్యోగుల అంశంలో కొంత మెరుగ్గానే ఉందని జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అతి తక్కువ నిరుద్యోగత నమోదైందని వెల్లడించింది. అదే.. ఏపీలో ఈ శాతం 6.2గా నమోదైందని పేర్కొంది. అత్యధికంగా హర్యానాలో 23.4 శాతం, రాజస్థాన్ లో 18.9 శాతం, త్రిపురలో 17.1, జమ్మూ కశ్మీర్ లో 15.0, ఢిల్లీలో 14.01, హిమాచల్ ప్రదేశ్ లో 13.9, బీహార్ లో 13.3 శాతం నిరుద్యోగులున్నారు. అదేవిధంగా ఇటీవల రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో అస్సాం సీఎం శర్మ వార్తల్లోకెక్కింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగత శాతం 8.5గా నమోదైంది. అతి తక్కువగా తెలంగాణలోనే 0.7గా ఉండగా, గుజరాత్ లో 1.2 నిరుద్యోగత రేటు నమోదైనట్టు వెల్లడించింది.