కేంద్రం దేశభక్తి మాటున దేశానికి ద్రోహం చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, మోడీ, అదానీల స్నేహబంధం ప్రజలకు అర్థం అవుతుందని.. బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతోందన్నారు. ఎఫ్ ఆర్ బీఎం పరిధిలోనే రాష్ట్రం అప్పులు చేస్తుందని స్పష్టం చేశారు. పరిమితికి మించి అప్పులు చేసింది కేంద్రమేనని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని అన్నారు. అనేక తప్పులు చేస్తున్న బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని వ్యాఖ్యానించారు ఆయన.
విదేశీ బొగ్గునిల్వలతో తయారు చేసిన విద్యుత్ 50 రూ. వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్సీ నిర్ణయం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. అదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు.
సంస్కరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తుందన్నారు. కేంద్రం నిర్ణయంతో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు. అదాని విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు అమ్మిస్తున్నకేంద్రం విదేశీ బొగ్గుతోనే విద్యుత్ సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు.