కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం బలగం. టాలీవుడ్‌లో పూర్తిగా తెలంగాణ కథాంశంతో తెరకెక్కిన సినిమాగా ‘బలగం’ బలమైన పేరుతెచ్చుకుంది. బలగం తమ మట్టి సువాసన వెదజల్లే సినిమా అని తెలంగాణా ప్రజ ఈ చిత్రాన్ని గుండెలకు హత్తుకుంది.
ఇప్పటికే రూ.10 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. బంధాలు, విలువలు చూపిస్తూ గుండెల్ని పిండేలా ఉన్న ప్రతీ ఒక్క సీన్, ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పల్లెకు పట్టంకట్టిన కారణంగా ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. గ్రామాల నుంచి జనాలు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఒకప్పుడు దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం సినిమాకి ప్రజలు బళ్ళుకట్టుకుని థియేటర్ కి వెళ్ళే వాళ్ళట. అదే తరహా ఆదరణను బలగం సంపాదించడాన్ని చూస్తే ప్రజలు ఈ చిత్రాన్ని ఎంతగా సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
కాగా తాజాగా ఈ సినిమా చూసేందుకు దారిపల్లి గ్రామస్తులు నిజామాబాద్‌కు స్పెషల్‌గా బస్సు కట్టుకొని మరీ వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆదరణకు, సక్సెస్‌కు ఇది మరో ఉదాహరణ అని చెప్పవచ్చు.
If this is not Love then what is?
The people of #Daripally village have travelled all the way to Nizamabad to watch #Balagam in a theatre.
Daripally prekshakukalara…❤️❤️#Balagam #RunningSuccessfully pic.twitter.com/NdPbMPjbVk
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) March 12, 2023