రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. అలాగే ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది.
ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించబోతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆఖరి సారిగా రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పర్వాలేదు అనిపించుకున్నాడు.
అంతకుముందు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ ట్రాక్ పట్టాడు. ఈ చిత్రం రామ్ తో పాటు పూరి జగన్నాథ్ కు కెరీర్ టర్న్ చేసింది.