రెండు రోజుల క్రితం తిరుమల ఆలయం ఎదుట కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె పవిత్రకు మతిస్థిమితం లేదని.. అందుకే బాలుడిని తీసుకెళ్లిందని ఆమె తల్లిదండ్రులు తిరుమల విజిలెన్స్ అధికారులకు లొంగిపోయినట్టు తెలిపారు.
ప్రస్తుతం తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్ లో బాలున్ని క్షేమంగా ఉంచిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించినట్టు పోలీసులు వెల్లడించారు.
మే 3న బాలుడిని ఎత్తుకెళ్లిన నిందితురాలు పవిత్ర మైసూర్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. ఎందుకు తీసుకొచ్చావని వారు ప్రశ్నించారు. తర్వాత తిరుమలకు వచ్చి బాలుడిని తితిదే విజిలెన్స్‌కు పోలీసులకు వారు అప్పగించారు.
మతిస్థిమితం లేక బాలుడిని తమ కూతురు తీసుకొచ్చిందని పోలీసులకు కిడ్నాపర్ పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు.