రెండోడు కొట్టుకుంటుంటే.. మూడోనికి సందు అవుడంటే ఇదే కావచ్చు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలను పరిష్కరించడానికి పెద్ద మనిషులుగా పిలిస్తే..ఆ ఆస్తిని మాకే అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. చివరకు తమ ఇంటి స్థలాన్ని కబ్జా పెట్టారని ఆరోపిస్తున్నారు బాధితులు.
ఫతేనగర్ పరిధిలోని శివశంకర్ కాలనీలో స్వరూప అనే మహిళ నివాసం ఉంటోంది. కొంత కాలం క్రితం భర్త గుండె జబ్బుతో మరణించాడు. భర్త బతికున్న ఉన్న సమయంలో.. అతని సోదరుడితో కలసి పొత్తులో ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో కొనుగోలుకు సంబంధించిన పత్రాలను బాధితురాలి బావ పేరుమీద రాసుకున్నారు. స్వరూప భర్త చనిపోయిన తర్వాత అతను తన బావ రివర్స్ అయ్యడు. ఆస్తి అంతా తనదేనంటూ స్వరూపకు మొండిచెయ్యి చూపించాడు.
ఈ తగాదాలో ఇరువురు కలిసి అదే కాలనీకి చెందిన విజయ్, లడ్డు అనే ఇద్దరు పెద్ద మనుషుల వద్దకు పరిష్కారానికి వెళ్లారు. న్యాయం చేయమని పోయిన పాపానికి తమ ఇంటి స్థలాన్ని తక్కువ ధరకు అమ్మాలని.. బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరాకరించంతో.. ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి వివిధ రకాలుగా తమను హింసిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి.. ఇక్కడ మేము చెప్పిందే సాగాలి.. మేము చెప్పిందే తీర్పు అంటూ తమను బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితురాలు స్వరూప మాట్లాడుతూ.. ఇంటి పెద్ద అయిన తన భర్త గుండెజబ్బుతో బాధపడుతూ మృతి చెందాడని.. చికిత్స చేయించడానికి ఉన్నడబ్బులన్నీ ఆసుపత్రులకు ఖర్చు చేశానని చెప్పింది. కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నానని వాపోయింది. తనకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని మొరపెట్టుకుటోంది ఆ మహిళ. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకముందే.. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటోంది.