వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం చోటు చేసుకుంది. క్లీనిక్ ఫస్టెడ్ సెంటర్ లో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి వైద్యం కోసం తస్లి అనే మహిళ క్లినిక్ కి వచ్చారు.
అయితే ఆర్ఎంపి డాక్టర్ నర్సింహారెడ్డి వైద్యం చేయగా మహిళ తస్లి వైద్యం వికటించి మృతి చెందింది. మృతురాలి వయసు 38 సంవత్సరాలు కాగా వైద్యుడి ఇంటిని మృతురాలు తస్లి బంధువులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.
మాకు న్యాయం కావాలి అంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.