బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జానకీపురం సర్పంచ్ నవ్య ఇటీవల తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ఎదుట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను లొంగలేదని గ్రామ అభివృద్ధికి అడ్డం పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిని సుమోటోగా తీసుకున్న కమిషనర్ విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఇక ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై ఇప్పటి జానకీపురం సర్పంచ్ నవ్య మీడియా ముందుకొచ్చారు. తనను బీఆర్ఎస్ నాయకుడు పెడుతున్న లైంగిక, మానసిక వేధింపులపై ఘాటు ఆరోపణలు చేశారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బులతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని.. అన్నారు.
తననే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య. అయితే రాజయ్యకు వివాదాలు కొత్త కాదు. ఆయన గతంలో ఓ మహిళా నాయకురాలిపై చేయి వేసినట్లు, కేక్ తినిపించినట్లుగా వీడియో, ఫోటోలు వైరల్ అయ్యారు. దీంతో ఆయనకు కొంటె ఎమ్మెల్యేగా పేరు పడింది.