వారంలో ఐదు రోజుల పని విధానానికి త్వరలోనే కాలం చెల్లనుంది.ఇప్పటికే పలు దేశాలు వారంలో నాలుగు రోజుల పనివిధానం దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ఈ రకమైన విధానంపై ట్రయల్ మొదలు పెట్టింది.
బ్రిటన్ లోని దాదాపు 70 కంపెనీలు 3300 మంది వర్కర్లకు వారంలో నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తున్నాయి. వీరికి వారంలో మూడు రోజులు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ సెలవు దినాలకు గానూ వేతనాల్లో ఎలాంటి కోతలు విధించడంలేదని కంపెనీలు చెబుతున్నాయి.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ పని విధానాన్నిఆరు నెలల పాటు అమలు చేయనున్నారు.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం,ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం,బోస్టన్ కాలేజ్లోని పరిశోధకుల భాగస్వామ్యంతో ‘4 డేస్ పర్ వీక్ ‘ గ్లోబల్ క్యాంపెయిన్ మేరకు ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.
Advertisements
దీన్ని100:80:100 మోడల్ లో అమలు చేస్తున్నారు.అంటే 80శాతం కాలానికి 100 శాతం జీతం,100 శాతం ప్రొడక్టివిటీ నమూనాలో దీన్నిఅమలులోకి తెస్తున్నారు.ప్లాటెన్స్ ఫిష్,షెఫీల్డ్ సాఫ్ట్ వేర్, రెవలిన్ రోబోటిక్స్ లాంటి పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి..