జమ్మూ కాశ్మీర్ సహా హిమాలయ రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు అనే మాట వాస్తవం. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ ను కలుపుతూ హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వరకు ఒక రైల్వే లైన్ కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే హిమాలయాల్లో రైలు పట్టాలను నిర్మించడం కాస్త కష్ట సాధ్యమే. అయినా సరే కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టి సారిస్తుంది.
Also Read:ఆ సినిమా చూసి సదా కన్నీళ్లు.. ఆ రోజు గుర్తొచ్చి..!
ఇప్పుడు లెహ్ నుంచి కార్గిల్ మీదుగా శ్రీనగర్ వరకు లైన్ ఒకటి నిర్మించే ఆలోచనలో ఉన్నామని కేంద్రం కూడా ప్రకటన చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు రైల్వే లైన్లను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా జమ్మూ కాశ్మీర్ లోనే ఉంది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన చినాబ్ నది మీద ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ను జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై దాదాపుగా నిర్మాణం పూర్తవుతుంది.
రియాసీ జిల్లాలో ని కౌరీ గ్రామంలో కత్రా -బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెనను నిర్మాణం జరుగుతుంది. ఈ వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. 2004లో ఈ వంతెన నిర్మాణ పనులను అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటుంది. అలాగే రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువగా వచ్చే భూకంపాల తీవ్రతను కూడా తట్టుకునే విధంగా నిర్మాణం జరుగుతుంది. ఈ వంతెన యొక్క కాలపరిమితి 120 సంవత్సరాలు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో… 1.3 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం పనులు ఈ ఏడాది చివరికి దాదాపుగా పూర్తి కానుంది.
Also Read:ఆ సినిమా చూసి సదా కన్నీళ్లు.. ఆ రోజు గుర్తొచ్చి..!