అక్రమ సంబంధాల విషయంలో ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేస్తున్నా సరే కొంతమంది వైఖరి మాత్రం ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా అక్రమ సంబంధాలకు సంబంధించి హత్యలు గాని ఆత్మహత్యలు గాని మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేశారు.
జాతీయ మీడియా కథనం ప్రకారం 23 ఏళ్ల సుదీర్ఘ బి.టెక్ చదువుతున్నాడు. హత్య తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక చూసి ఖంగు తిన్నారు. పోస్టుమార్టం నివేదికలో అతని కడుపులో పగిలిన గాజు ముక్కలు కనిపించాయని పోలీసులు తెలిపారు. పాండే అనే ప్రాంతంలో అతని మృతదేహం లభ్యం అయినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో అతని మొహం పూర్తిగా కాలిపోయింది అని దీంతో గుర్తింపు ఆలస్యమైందని పోలీసులు వివరించారు.
పోలీసుల నివేదిక ప్రకారం హంతకులు బీటెక్ విద్యార్థిని చిత్రహింసలు పెట్టి చంపారు ఆపై అతనిని గుర్తించకుండా ఉండటానికి మృతదేహాన్ని కాల్చేశారని పేర్కొన్నారు. హత్య తర్వాత మృతదేహంపై యాసిడ్ పోశారని బరేలిలోని కాలేజీ కి వెళ్తున్న సమయంలో గురువారం అతన్ని కిడ్నాప్ చేశారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా మురాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ మీడియాకు వివరించారు. మజాలా అనే ప్రాంతంలో ఆమెను కలవడానికి ఆ యువకుడు వెళ్లాడని ఈ సమయంలో అతన్ని కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.