ఒక పక్క సీనియర్ హీరోలు అందరూ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో అక్కినేని నాగార్జున మాత్రం ఒక్క హిట్ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 15 ఏళ్ళ నుంచి ఆయనకు సొంతగా ఒక్క హిట్ కూడా భారీగా లేదు అనే చెప్పాలి. మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అయినా సరే ఆయనకు హిట్ రావడం లేదు. ఇక కుమారుల కెరీర్ కూడా ఆశించిన విధంగా లేదనే చెప్పాలి.
Also Read:ఈ సినిమా జానర్ చెప్పడం కష్టం
బంగార్రాజు సినిమా కాస్తో కూస్తో ఉత్సాహ పరిచినా అది నాగార్జున స్థాయికి తగినది కాదు అనే చెప్పాలి. సినిమాలు వరుసగా చేస్తున్నారు గాని అవి మాత్రం ఆడటం లేదు. మంచి హిట్ కోసం ఆయన యువ రచయితలతో మాట్లాడి మంచి కథల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ధమాకా సినిమా కథ రాసిన బెజవాడ ప్రసన్న కుమార్ తో నాగార్జున మాట్లాడి ఒక మంచి కథ రాయించారు.
ఆ కథ కోసం ఆయన 50 లక్షలు ముందు అడిగారు. ఇక ధమాకా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో మాట మార్చి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కథ చివరి దశలో ఉందని ఇక దర్శకుడు ఎవరు అనే దాని మీద నాగార్జున అంత క్లారిటీకి రాలేదని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ షో కూడా అంతగా హిట్ కాలేదు.
Also Read:“వరల్డ్ ఆఫ్ శబరి” విడుదలైంది