తాగిన మత్తులో కొంత మంది యువకులు ఏం చేస్తారో అర్ధం కాకుండా పోతోంది. తాగిన తర్వాత తనకు ఎదురే లేదు అన్నట్టు విర్రవీగిపోతారు. అందులో భాగంగానే కొందరు యువకులు ఫుల్ గా తాగి.. బిజీగా ఉండే రోడ్డులో కారుపైకి ఎక్కి చేసిన వెర్రి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో పబ్లిష్ అయిన కొన్ని గంటలకే పోలీసులు స్పందించి.. ఆ కారు ఓనర్ పై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది. ఘాజియాబాద్ లో ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై కొంత మంది యువకులు తాగిన మత్తులో వెర్రి చేష్టలు చేశారు.
కారు నెమ్మదిగా నడస్తుండగానే ఇద్దరు యువకులు పైకి ఎక్కి చిందులు వేశారు. దీనిని అటువైపుగా కారులో వెళ్తున్న ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ యువకులపై యాక్షన్ తీసుకోవాలంటూ ఘాజియాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.
కొద్ది గంటల్లోనే స్పందించిన పోలీసులు.. ఆ కారుపై ఏకంగా రూ.20 వేలు జరిమానా విధించారు. అందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు పోలీసుల ఉన్నాతాధికారులు.