పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కీర్తి ఎన్నో సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ ను రాణించలేకపోయింది. నాగార్జునతో రావోయి చందమామ, మహేష్ బాబు అర్జున్ వంటి సినిమాల్లో కీర్తి రెడ్డి నటించింది.
ఆ తర్వాత టాలీవుడ్ లో ఛాన్స్ రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది.
సినిమాల్లోకి రాక ముందు మన టాప్ హీరోయిన్స్ పేర్లు ఏమిటో తెలుసా ?
అయితే కొన్ని గొడవలు రావడంతో సంవత్సరానికే సుమంత్ కీర్తి రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత ఒక ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది కీర్తి రెడ్డి. ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే కీర్తి రెడ్డి తమ్ముడు కూడా సినిమాల్లో హీరోగా నటించాడు.
RRR @ పాట పాడిన సింగర్… బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?
ఈ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ హీరో ఎవరో కాదు, సామ్రాట్. అయితే సామ్రాట్ నటించిన సినిమాలేవీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కాలేదు. అహ నా పెళ్ళంట సినిమా తో మాత్రం గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు.
Advertisements
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా సామ్రాట్ పాల్గొన్నాడు. ప్రస్తుతానికి అయితే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో సామ్రాట్ ఎదురుచూస్తున్నాడు. మరి ఆ హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.