కొందరి హీరోల అభిమానులు చేసే ఓవర్ యాక్షన్ కు హద్దులే ఉండవు. దానివల్ల వారికి ఎటువంటి నష్టం జరగకపోయినా.. ఎదుటి వారికి మాత్రం తీవ్రస్థాయిలోనే నష్టం వాటిల్లుతుంది. దానికి ఉదాహరణే తాజాగా జరిగిన సంఘటన.
ఇటీవల విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా భారీ స్థాయిలో విజయం సాధించింది. అయితే.. సినిమాలో హీరో సూర్య ఓ ఐదు నిమిషాలు పాటు అతిథి పాత్రలో కనిపించి, తన నటనతో మెప్పించారు. దీంతో సూర్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అయితే.. వారి ఓవరాక్షన్ ఓ అనర్థానికి దారి తీసింది. అది ఏంటంటే..
పుదుచ్చేరిలోని ఓ సినిమా థియేటర్ లో విక్రమ్ చిత్రం విడుదల అయి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సూర్య తెర మీద కనిపించగానే అతని అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయి థియేటర్ లోపలే టపాసులు కాల్చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్క్రీన్ కు అంటుకుపోవడంతో సినిమా ప్రదర్శిస్తుండగానే స్క్రీన్ కాలిపోయింది.
వెంటనే అప్రమత్తం అయిన థియేటర్ సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు.