ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయమంతా సినీస్టార్స్ చుట్టూనే తిరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టికెట్స్ విక్రయించాలని శాసనసభలో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. బెనిఫిట్ షోలు కూడా వేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం రిలీజ్ అయింది.
చాలాచోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోలు పడ్డాయి. అయితే కృష్ణా జిల్లా మైలవరం లో ఉదయం ఎనిమిది గంటలకు అఖండ బెనిఫిట్ షో ను సంఘమిత్ర థియేటర్ లో వేశారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు థియేటర్ ను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బెనిఫిట్ షో అనుమతి లేకుండా వేసినందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు.