విజయవాడ : సాహో సినిమా టికెట్ల ధరను పెంచేందుకు అనుమతించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న క్లారిటీ ఇచ్చినప్పటికీ సాహో ధియెటర్లలో అదేం నడవడం లేదు. టిక్కెట్ రేట్లు ఇష్టం వచ్చిన రేట్లకే అమ్ముతున్నారు. నిన్న రాత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాహో సినిమా టికెట్ల ధర పెంపు అంశాన్ని అధికారులు సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. టిక్కెట్ మూడొందలకు అమ్ముకునేందుకు అనుమతి అడుగుతున్నారని ప్రస్తావించారు. దానికి ఆయన నో అని చెప్పారు. టికెట్ పెంచడాన్ని అనుమతించవద్దని ఆర్డరేశారు. ఒక్కో సినిమాకు ఒక్కో ధర వద్దని సీఎం జగన్ అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానం అన్ని సినిమాలకూ ఒకేలా ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, సాక్షాత్తు ముఖ్య మంత్రి జగన్ మాటలు ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. థియేటర్లలో ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేశారు. సినిమా ఓవర్సీస్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో 3 -4 షోలలో అయినా వసూళ్లు చెయ్యాలని డిస్ట్రిబ్యూటర్స్ డిసైడయ్యారని సమాచారం. రివ్యూలు స్ప్రెడ్ అయ్యే వరకు వసూళ్ల పర్వం నడుస్తుంది, ప్రమోషన్ వల్ల వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకొని, నష్టాన్ని కొంతయినా పూడ్చుకోవాలని చూస్తున్నారు. టికెట్ రూ.300 వరకు వసూలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో అధికారుల తప్పు లేకపోలేదు. నిన్న రాత్రి వరకు ప్రకటన విడుదల కాకపోవడంతో, ఎవరికి నచ్చిన రేట్లు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. సాయింత్రానికి పరిస్థితి మారొచ్చు, కాని అంతలోపు చాలా మంది ప్రేక్షకుల జేబులు ఖాళి అవ్వక మానవు.