హైదరాబాద్ లో సైబర్ నేరాలతో పాటు దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు.
ఈ ఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంతో పాటు.. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. దోబీఘాట్ లోని జయ్ హింద్ హోటల్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎంలలోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు.
చోరీ ప్రయత్నంలో భాగంగా ఏటీఎం మిషన్ లను బ్రేక్ చేయగానే సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో అక్కడి నుండి ఇద్దరు పరారయ్యారు. గమనించిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తం అయిన మాదన్నపేట్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.
కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు.