మీరంతా సూర్య సినిమా గ్యాంగ్ చూసే ఉంటారు. సీబీఐ అధికారులమని చెప్పి బ్లాక్ మనీ మొత్తాన్ని దోచుకెళ్తారు. అచ్చం అలాంటి సీనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ ఐటీ అధికారులమని చెప్పి దోచేశారు. గచ్చిబౌలిలో ఐటీ అధికారులమంటూ ఓ ఇంట్లోకి వచ్చి బంగారం, డబ్బుతో పరారయ్యారు దొంగలు.
ఆరెంజ్ కౌంటీలోని సి-బ్లాక్ లో భాగ్యలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఉదయాన్నే గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారులమంటూ వచ్చారు. ఇంట్లోకి రాగానే వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు తీసుకుని విచారిస్తున్నట్లు నటించారు. ఎక్కడా అనుమానం రాకుండా తనిఖీలు చేస్తున్నట్టు హడావుడి చేసి ఇంట్లో ఉన్న మూడు కిలోల బంగారం, డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనుమానం వచ్చిన బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.