కలియుగ వైకుంఠం తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఆలయం పై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా రెండు లక్షల పైగా నగదును దోచుకెళ్లాడు ఓ దుండగుడు.
శనివారం రాత్రి 36వ కౌంటర్ నెంబర్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.
ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు గతంలో చోరీలు చేసినట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.